![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -493 లో.... ప్రేమ తన పుట్టింట్లోకి వెళ్తుంది. ఇక శాశ్వతంగా వెళ్ళిపోయిందని సుకన్య, వల్లి హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొకవైపు ప్రేమ వెనకాలే నర్మద వెళ్తుంది. ప్రేమ రావడం చూసి భద్రవతి ఆశ్చర్యపోతుంది. అత్త నేను వచ్చేసాను ఇక ఇక్కడే ఉండిపోతానని ప్రేమ అనగానే నా కొడలు వచ్చేసిందని భద్రవతి మురిసిపోతుంది. అమ్మ ప్రేమ వచ్చేసావా అని సేనాపతి ఎమోషనల్ అవుతాడు. వాళ్ళ మాటలు పట్టుకొని నిజంగానే వచ్చేసావా ఏంటని పెద్దావిడ, రేవతి కోప్పడుతారు.
వాడిని వద్దు అనుకొని వచ్చావ్ కదా.. ఇక మెడలో తాళి ఎందుకు అని భద్రవతి అంటుంది. దాంతో ప్రేమ నవ్వుకుంటుంది.. నమ్మేసారా ధీరజ్ కి నాకు ఒకరంటే ఒకరికి ఇష్టం కాదు ఒకరికోసం ఒకరం బ్రతుకుతున్నామని ప్రేమ అనగానే భద్రవతి షాక్ అవుతుంది. వాడు ఈ జన్మలో బయటకు రాడు అని సేనాపతి అంటాడు. మీ కళ్ల ముందే వాడిని బయటకు తీసుకొని వస్తాను చూడమని ప్రేమ ఛాలెంజ్ చేస్తుంది. ఆ మాటలకి నర్మద విజిల్ వేస్తుంది. శబాష్ ప్రేమ రామరాజు కోడళ్లు అంటే ఏంటో చూపిస్తామని నర్మద అంటుంది. అక్కడ జరిగేది మొత్తం వల్లి, సుకన్య వింటారు.
ఆ తర్వాత నర్మద లాయర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ధీరజ్ ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తేనే బయటకు వస్తాడని అతను చెప్తాడు. దాంతో అసలు ధీరజ్ కార్ లో ఎక్కింది ఎవరో కనిపెట్టాలని.. నర్మద, ప్రేమ ఇద్దరు అతను కార్ ఎక్కిన ప్లేస్ కి వెళ్లి అక్కడున్న సీసీటీవీని చూస్తారు. అందులో వాడు మామిడికాయలు అంటూ ధీరజ్ కార్ లో ఎక్కడం ఉంటుంది. అదంతా నర్మద వీడియో తీసుకుంటుంది. అందులో వాడు వచ్చిన బండి నెంబర్ చూసి తనకి తెలిసిన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఆ బండి ఎవరిదో కనుక్కోమని నర్మద చెప్తుంది. ఇక నర్మద, ప్రేమ వాళ్లని సుకన్య ఫాలో అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |